స్టార్టప్‌లో ఎయిర్‌టెల్‌ పెట్టుబడి

23 Dec, 2022 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దేశీ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా స్టార్టప్‌ లెమ్నిస్క్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. రియల్‌ టైమ్‌ మార్కెటింగ్‌ ఆటోమేషన్, సెక్యూర్‌ కస్టమర్‌ డేటా ప్లాట్‌ఫామ్‌ అందిస్తున్న ఈ బెంగళూరు సంస్థలో 8 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. 

స్టార్టప్‌ యాక్సిలరేటర్‌ కార్యక్రమంలో భాగంగా సొంతం చేసుకున్న ఈ వాటా విలువను మాత్రం వెల్లడించలేదు. లెమ్నిస్క్‌తో జత కట్టడం ద్వారా భారీ అవకాశాలకు తెరతీయనున్నట్లు ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ సీఈవో అదర్శ్‌ నాయర్‌ పేర్కొన్నారు.

 తద్వారా భవిష్యత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సీడీపీ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. కంపెనీకి చెందిన రియల్‌ టైమ్‌ ఆటోమేషన్‌ ఇంజిన్‌ తమకు సరిగ్గా ఫిట్‌ అవుతుందని, 35 కోట్లకుపైగా తమ కస్టమర్లు రోజూ పలు బ్రాండ్లతో ఇంటరాక్ట్‌ అవుతుంటారని వివరించారు.    

మరిన్ని వార్తలు