Bharti Airtel: శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం..!

5 Jan, 2022 19:52 IST|Sakshi

స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను భారత్‌లో అందించేందుకు ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ సిద్దమైన విషయం తెలిసిందే. పలు కారణాలతో స్టార్‌లింక్‌ పనులు భారత్‌లో నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా ఉండగా స్టార్‌లింక్‌కు పోటీగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలపై పలు టెలికాం సంస్థలు కూడా కన్నేశాయి. భారత్‌లో శాటిలైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడం కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా సన్నద్ధమైంది.

జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు..!
శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్లు  తెలుస్తోంది. ఈ జాయింట్‌ వెంచర్‌లో ఎయిర్‌టెల్‌ సుమారు 33 శాతం, హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్‌ వెంచర్‌ భారత్‌లో శాటిలైల్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించనున్నాయి. 

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం ఎయిర్‌టెల్‌,హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్‌ టెర్మినల్‌ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్‌ ఆపరేటర్‌గా హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌  నిలుస్తోంది. బ్యాంకింగ్‌, ఏరోనాటికల్‌, మేరీటైమ్‌ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది..

చదవండి: రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..? 

మరిన్ని వార్తలు