పేటీఎంపై సునీల్‌ మిట్టల్‌ కన్ను!

25 Feb, 2023 06:55 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌.. డిజిటల్‌ చెల్లింపుల సేవల్లోని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. 

ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో విలీనం చేయడం ద్వారా వాటా పొందాలనుకుంటున్నట్టు.. అలాగే, పేటీఎంలో ప్రస్తుతం వాటాలు ఉన్న ఇతరుల నుంచి కొంత కొనుగోలు చేసేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. పేమెంట్‌ బ్యాంకుల్లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లాభాలతో నడుస్తోంది.

 కానీ, పేటీఎం మాత్రం నష్టాల్లో ఉన్న కంపెనీ. కాకపోతే గతేడాది రూ.2,150 ఐపీవో జారీ ధరతో పోలిస్తే పేటీఎం షేరు 75 శాతం వరకు నష్టపోయి ట్రేడ్‌ అవుతోంది. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా ఉండడంతో భారతీ ఎయిర్‌టెల్‌ సునీల్‌ మిట్టల్‌కు ఆసక్తి ఏర్పడినట్టు తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు