5జీ కోసం జతకట్టిన ఎయిర్‌టెల్‌, ఇంటెల్

21 Jul, 2021 17:09 IST|Sakshi

న్యూఢిల్లీ: 5జీ నెట్​వర్క్ అభివృద్ధి కోసం ఇంటెల్ తో ఎయిర్‌టెల్‌ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల దేశంలో 5జీ వేగం విస్తృతంగా పెరగనుంది. 5జీ నెట్​వర్క్ వల్ల ఇండస్ట్రీ 4.0, ఐఓటి(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అప్లికేషన్లలలో, టెలి మెడిసిన్, క్లౌడ్ గేమింగ్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్యుమెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ వంటి వాటిలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. భారతదేశంలో మొదటి టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌టెల్‌ ప్రధాన నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోందని ఐఏఎన్ఎస్ నివేదిక తెలిపింది.

ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మొబైల్ ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్​వర్క్ స్లైసింగ్ కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడానికి ఎయిర్‌టెల్‌ నెట్​వర్క్ ఇంటెల్ తాజా మూడవ తరం జియోన్ స్కేలబుల్ ప్రాసెసర్లు, ఎఫ్ పీజిఏ, ఈఏఎస్ఐసీలు, ఈథర్నెట్ 800 సిరీస్ వాడనుంది. ఓ-ఆర్ఎఎన్ నెట్​వర్క్ లో భాగస్వాములైన ఎయిర్‌టెల్‌, ఇంటెల్ మేక్ ఇన్ ఇండియా 5జీ అభివృద్ధి కోసం స్థానిక భాగస్వాముల ద్వారా భారతదేశంలో ప్రపంచ స్థాయి టెలికామ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి పనిచేస్తున్నాయి.


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు