ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌..ఒకే కనెక్షన్‌పై 2 సిమ్‌లు, డీటీహెచ్‌ సేవలు

25 Mar, 2023 21:16 IST|Sakshi

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ రూ.799 బ్లాక్‌ పేరుతో కొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సర్వీసులు పొందే ఈ ఒక్క ప్లాన్‌ కింద డీటీహెచ్‌తో పాటు ఫైబర్‌, మొబైల్‌ సేవల్ని వినియోగించుకోవచ్చు. 

ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ రూ.799 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ 
ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ రూ.799 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లో మొత్తం 3 కనెక్షన్‌లు పొందవచ్చు. అందులో 2 పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌, మరోకటి డీటీహెచ్‌ కనెక్షన్‌. బేస్ రూ. 799 ప్లాన్ పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్‌  ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లాగానే 105 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ పంపుకోవచ్చు. అదనంగా, ఎయిర్‌టెల్ బ్లాక్ రూ. 799 ప్లాన్ వినియోగదారులకు రూ. 260 విలువైన టీవీ ఛానెళ్లు డీటీహెచ్‌ కనెక్షన్‌ కింద లభిస్తాయి.  

ఓటీటీ సర్వీసులు సైతం
వీటితో పాటు ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ రూ.799లో యూజర్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా,డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ తో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ సర్వీసుల్ని ఉపయోగించుకోవచ్చు.  

ఎయిర్‌టెల్‌ షాప్‌లో బై నౌ- పే లేటర్‌
ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ రూ.799లో కస్టమర్లు వన్‌ బిల్‌ అండ్‌ వన్‌ కాల్‌ సెంటర్‌ సర్వీసులు, 60 సెకండ్లలో  కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అందుబాటులోకి వస్తారు. అలాగే ఫ్రీ సర్వీసు విజిట్లు, ఎయిర్‌టెల్‌ షాప్‌లో బై నౌ- పే లేటర్‌ సదుపాయం వంటివి లభిస్తాయి.

5జీ సేవలు సైతం
ఎయిర్‌ టెల్‌ బ్లాక్‌ కస్టమర్లు వీవోఎల్‌టీఈ (VoLTE),వోవైఫై (VoWiFi) సేవలతో పాటు, అన్‌లిమిటెడ్‌ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. తద్వారా ఈ ఏడాది జూన్‌ నాటి 4వేల టౌన్లలో 5జీ సేవల్ని అందించే లక్ష్యంగా పెట్టుకుంది. 

మరిన్ని వార్తలు