Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త..!

4 Apr, 2022 17:29 IST|Sakshi

నెలవారీగా రీచార్జి చేసుకునే ప్లాన్‌ ఒక్కటైనా అందించాలంటూ టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ఆదేశించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే రిలయన్స్‌ జియో తన యూజర్ల కోసం క్యాలెండర్‌ మంత్లీ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఎయిర్‌టెల్‌ కూడా తన యూజర్ల కోసం 30 రోజుల వ్యాలిడిటీ​ ప్లాన్స్‌ను ప్రకటించింది. 

ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్స్‌ ఇవే..!
ట్రాయ్‌ ఆదేశాల ప్రకారం ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ. 296, రూ. 319 ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌తో యూజర్లకు 30 రో​జుల పాటు వ్యాలిడిటీ దక్కుతుందని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్‌టెల్‌ రూ. 296 ప్లాన్‌తో 25 జీబీ ఇంటర్నెట్‌ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ ,30 రోజుల పరిమితితో రానుంది.  ఎయిర్‌టెల్‌ రూ. 319 ప్లాన్‌తో డేలీ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 30 రోజుల వ్యాలిడిటీ రానుంది. 

ఎయిర్‌టెల్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్లాన్స్‌తో అదనపు ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్స్‌తో యూజర్లకు 30 రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఉచిత ట్రయల్‌, మూడు నెలల అపోలో 24×7 సర్కిల్ సేవలు, ఫాస్ట్‌ట్యాగ్‌పై  రూ. 100 క్యాష్‌బ్యాక్‌, వింక్‌ మ్యూజిక్‌ను యూజర్లు పొందవచ్చును. 

చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! సరికొత్త ఒరవడితో ప్లాన్స్‌.!

మరిన్ని వార్తలు