Airtel: 5జీ జియోకు గట్టి పోటీ...ఎయిర్‌టెల్‌ గుడ్‌న్యూస్‌! షేర్లు జూమ్‌!

8 Sep, 2022 12:41 IST|Sakshi

నెల రోజుల్లో  ఎయిర్‌టెల్‌  5 జీ సేవలు

 2023 చివరిక నాటికి అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ 5జీ సేవలు

ఎయిర్‌టెల్‌  షేర్లు జూమ్

న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ నెల రోజుల్లోగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్‌ నాటికి ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేస్తామని సంస్థ సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు.

దీపావళికి రిలయన్స్‌ జియో 5జీ సేవలను లాంచ్‌ చేయనున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ వేగం పెంచింది. శరవేంగంగా  దేశంలో 5జీ సేవలను లాంచ్‌ చేయనుంది. ఈ వార్తలతో గురువారం ఇంట్రాడే ట్రేడ్‌లో ఎయిర్‌టెల్‌ షేరు రెండు శాతానికిపైగా లాభపడి  రూ.770 స్థాయికి చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలను 2023లోగా కవర్‌ చేస్తామన్నారు. 4జీతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ 5జీ వేగం 20-30 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఏ ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నది వినియోగదార్లు ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని కూడా మిట్టల్‌  గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు