India digital ecosystem: ఎయిర్‌టెల్‌- మెటా పెట్టుబడులు

6 Dec, 2022 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెలికం మౌలికరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సామాజిక మాధ్య­మ రంగ దిగ్గజం మెటా, టెలికం కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. వేగవంతమైన డేటా, డిజిటల్‌ సేవలకు భారత్‌లో డిమాండ్‌ నేపథ్యంలో ఈ విభాగాల్లో సేవలు అందించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఇరు సంస్థలు సోమ­వారం ప్రకటించాయి. (మారుతి బాటలో, టాటా మెటార్స్‌: కస్టమర్లకు కష్టకాలం!)

అలాగే ప్రపంచంలో అతిపొడవైన సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థ అయిన 2ఆఫ్రికా పెరŠల్స్‌ ప్రాజెక్టును భారత్‌కు పొడిగించేందుకు మెటా, సౌదీ టెలికం కంపెనీతో ఎయిర్‌టెల్‌ చేతులు కలుపుతుంది. 2ఆఫ్రికా పెరŠల్స్‌ ప్రాజెక్టును భారతదేశానికి విస్తరించే ప్రణాళికను సెప్టెంబర్‌ 2021లో మెటా ప్రకటించింది. ముంబైలోని ఎయిర్‌టెల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు కేబుల్‌ను విస్తరిస్తారు. నెట్‌వర్క్‌లను నిర్మించడానికి సర్వీస్‌ ప్రొవైడర్లతో ఆదాయాన్ని పంచుకోవాలన్న టెలికం ఆపరేటర్ల డిమాండ్‌ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడడం గమనార్హం.   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు