ఎయిర్‌టెల్‌ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!

24 Apr, 2023 16:59 IST|Sakshi

ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ఈ ఏడాది డిసెంబర్‌ నెల చివరి నాటికి దేశం మొత్తం 5జీ సేవల్ని అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రణాళికల్లో భాగంగా రాబోయే వారాల్లో దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 300కి చేరుతుంది. 

ఈ తరుణంలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌లో యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాను పొందవచ్చు. తద్వారా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న నగరాల్లో యూజర్లు  నెట్‌వర్క్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు అమెజాన్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.

ఉచితంగా అమెజాన్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ప్లాట్‌ఫామ్స్‌

ఎయిర్‌టెల్‌ రూ. 499 ప్లాన్‌ : ఈ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో  5జీ అన్‌ లిమిడెట్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్‌ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అంతేకాదు 3 నెలల పాటు డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌, ఎక్స్‌ట్రీమ్‌యాప్స్‌ బెన్ఫిట్స్‌, వింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇలా అనేక ఆఫర్లు పొందవచ్చు. ఒకవేళ 5జీ లేకపోతే 4జీ యూజర్లు ప్రతిరోజు 3జీబీ డేటాను వినియోగించుకోవచ్చు

ఎయిర్‌టెల్‌ రూ. 839 ప్లాన్‌ : 84 రోజుల వ్యాలిడిటీతో 5జీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 100 ఎస్‌ఎంస్‌ఎస్‌లు పంపుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీప్లస్‌హాట్‌ స్టార్‌, ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ బెన్ఫిట్స్‌, రివార్డ్స్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, వింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. 4జీ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తుంది ఎయిర్‌టెల్‌ సంస్థ.

ఎయిర్‌టెల్‌ రూ.699 ప్లాన్‌ : ఈ సరికొత్త ప్లాన్‌లో ఎయిర్‌టెల్‌ అన్ లిమిటెడ్‌ 5జీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. వీటితో పాటు డిస్నీప్లస్‌హాట్‌ స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ బెన్ఫిట్స్‌ పొందవచ్చు. 4జీ యూజర్లు ప్రతి రోజు 3జీబీ డేటా పొందవచ్చు. 

ఎయిర్‌టెల్‌ రూ.999ప్లాన్‌ : 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 84రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌, ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ బెన్ఫిట్స్‌, వింక్‌ సబ్‌స్క్రిప్షన్‌, రివార్డ్స్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. 4జీ యూజర్లు 2.5 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.  

చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్‌ అదిరింది’.. యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ వైరల్‌

మరిన్ని వార్తలు