Airtel: కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌, 30రోజులు వాలిడిటీతో

10 Nov, 2022 11:33 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్‌ యూజర్లకు సరికొత్త ప్లాన్‌ను అందిస్తోంది. 30 రోజులవాలిడిటీతో రూ.199 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా  డేటా పెద్దగా వాడని యూజర్లకోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.  

ఎందుకంటే  30 రోజులకు గాను కస్టమర్లకు అందించే మొత్తం డేటా కేవలం 3జీబీ మాత్రమే. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 30 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే రోజుకు 100 మెసేజ్‌లకు పరిమితం. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది.

మరిన్ని వార్తలు