హైదరాబాద్‌ నుంచి ఆకాశ ఎయిర్‌

25 Jan, 2023 07:02 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఆకాశ ఎయిర్‌ హైదరాబాద్‌ నుంచి సర్వీసులను నేటి (బుధవారం) నుండి ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–గోవా మధ్య ఇవి నడువనున్నాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు మరో రెండు సర్వీసులను ఫిబ్రవరి 15 నుంచి జోడించనున్నారు.

విశాఖపట్నం సహా ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌ దేశంలోని 13 నగరాలకు సేవలను అందిస్తోంది. ఈ ఏడాది మరో నాలుగైదు నగరాలు తోడవనున్నాయని కంపెనీ కో–ఫౌండర్‌ ప్రవీణ్‌ అయ్యర్‌ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థ వద్ద 14 విమానాలు ఉన్నాయని చెప్పారు. మార్చి నాటికి మరో నాలుగు వచ్చి చేరుతున్నాయని వెల్లడించారు.

2023 రెండవ అర్ధ భాగంలో అంతర్జాతీయ సర్వీసులు నడుపుతామని తెలిపారు. నాలుగేళ్లలో ఆకాశ ఎయిర్‌ ఖాతాలో 72 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ఉంటాయని కో–ఫౌండర్‌ బెల్సన్‌ కొటినో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు