జొమాటోకు అలీబాబా ఝలక్‌, భారీగా షేర్ల అమ్మకం

1 Dec, 2022 08:59 IST|Sakshi

 అలీపే  3 శాతం వాటా విక్రయం 

సాక్షి, ముంబై: చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. (జోరుగా ప్యాసింజర్‌ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు)

కెమాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా కొనుగోలు చేసిన రూ.608 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన అమ్మకం ద్వారా అలిపే మొత్తం రూ.1,631 కోట్లను ఆర్జించింది.సగటున ఒక్కో షేరు విక్రయం ధరం రూ.62,06గా ఉంది. సెప్టెంబర్‌ చివరికి జొమాటోలో అలీబాబా గ్రూపునకు 13 శాతం వాటా ఉండగా, విక్ర­యం తర్వాత కూడా ఇంకా 10 శాతం వాటా మిగిలి ఉంది. సింగపూర్‌ సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌ టెమా­సెక్‌కు చెందిన కెమాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పీటీఈ 9.80 కోట్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది.  

ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్‌: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు!   

మరిన్ని వార్తలు