యూకే నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌.. కాస్ట్లీ గిఫ్ట్‌..కట్‌ చేస్తే!

19 Nov, 2022 16:32 IST|Sakshi

సాక్షి, ముంబై:  సోషల్‌మీడియాలో  ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లు పంపడం,  ఆనక మెల్లిగా మాటకలిపి, ఖరీదైన బహుమతులంటూ ఎరవేసి, అమాయకులకు కోట్ల  రూపాయల కుచ్చు టోపీ పెడుతున్న సంఘటన గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇలాంటి  నేరాలపై ఎన్ని సార్లు హెచ్చరించినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఉదంతాలు రిపీట్‌ అవుతూనేఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్‌కు చెందిన ఓ మహిళ రూ.1.12 కోట్ల రూపాయలను పొగొట్టకుంది.

రిటైర్డ్ మహిళా కోర్టు సూపరింటెండెంట్‌కు ఏడాది జూన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ నివాసిని   అంటూ ఒక వ్యక్తి  ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు.  దాన్ని ఈమె అంగీకరించారు. ఆ తరువాత అతనితో కలిపి మరో ఇద్దరు మాట కలిపి తమ ప్లాన్‌ను పక్కాగా  అమలు చేశారు.  ఫోన్లలో తరచూ మాట్లాడుతూ  బంగారం , ఇతర కాస్ట్లీ గిఫ్ట్‌లు  పంపిస్తున్నామంటూ మభ్య పెట్టారు. అయితే  దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుందని నమ్మబలికారు.  దీంతో ఆమె వారికి ఏకంగా 1.12 కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్‌ చేసింది.  ఇక  ఆ తరువాతనుంచి వారి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్‌ లేకుండా, ఫోన్‌లను స్విచాఫ్‌ చేసుకున్నారు.మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, కుట్ర కేసు నమోదు చేశామనీ,  cనిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అలీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు