‘ఇదే మంచి సమయం’.. జొమాటోలోని వాటా అమ్మనున్న అలిపే

28 Nov, 2023 21:33 IST|Sakshi

ప్రముఖ చైనా పేమెంట్‌ దిగ్గజం అలిపే కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ఉన్న తన వాటాను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

జొమాటోలో అలిపేకి మొత్తం 3.44 శాతం వాటా ఉంది. అందులో 3.4 శాతం వాటాను ఇండియన్‌ స్టాక్‌ మార్క్‌ట్‌లోని బ్లాక్‌ డీల్‌ (5లక్షల షేర్లను ఒక్కొకరికి అమ్మే) పద్దతిలో విక్రయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం విలువ 395 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు). 

జొమాటో - అలిపే మధ్య జరిగే ఈ డీల్‌లో సలహా ఇచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, మోర్గాన్‌ స్టాన్‌లీ ప్రతినిధుల్ని సలహాదారులుగా నియమించన్నట్లు సమాచారం. అయితే దీనిపై జొమాటో- అలిపేలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

రాకెట్‌ వేగంతో 
జొమాటో 2021 జులై నెలలో ఐపీఓకి వెళ్లింది. ఉక్రెయిన్‌పై రష్యా వార్‌తో పాటు ఇతర అనిశ్చితి పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్‌ మార్కెట్‌లోని టెక్నాలజీ స్టాక్స్‌ 2022 మే వరకు నష్టాల్లోనే కొనసాగాయి.

భారీ లాభాల్ని ఒడిసిపట్టి
మే నెల నుంచి తిరిగి పుంజుకోవడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 90 శాతం మేర జొమాటో షేర్ల విలువ పెరిగింది. దీంతో భారీ లాభాల్ని అర్జించిన అలిపే మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడుల్ని అమ్మేందుకు ఇదే మంచి సమయం అని తెలిపింది. అన్నట్లుగానే తాజాగా జొమాటోలోని వాటాను అమ్మేందుకు అలిపే చర్చలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు