ఈవీ మార్కెట్‌లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!

18 Feb, 2022 16:18 IST|Sakshi

Mini Cooper Electric India Launch On 24 February: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యు తన మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అయ్యింది. గత ఏడాది డిసెంబర్ నెలలో బీఎమ్‌డబ్ల్యు ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యువిని లాంఛ్ చేసిన తర్వాత మినీ కూపర్ ఎస్ఈ త్రీ డోర్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో లాంఛ్ చేయనుంది. ఈ మినీ కూపర్ ఎస్ఈ కారుని 2022 ఫిబ్రవరి 24న భారతదేశంలో విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. మొదటి బ్యాచ్లో 30 యూనిట్ల కార్లు కూడా ఇప్పటికే అమ్ముడుపోయాయి.కొత్త మినీ కూపర్ ఎస్ఈని ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆవిష్కరించారు.

ఈ ఎలక్ట్రిక్ కారు పెట్రోల్ వెర్షన్ కంటే 145 కిలోల బరువుగా ఉంది. కొత్త మినీ కూపర్ ఎస్ఈ 32.6 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. ఇది 182 హెచ్‌పీ పవర్, 270 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారును 11కెడబ్ల్యు ఛార్జర్ సహాయంతో 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే, అయితే 50కెడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా ఆ తర్వాతి నెలల్లో డెలివరీ చేసే అవకాశం ఉంది. మినీ ఇండియా ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది.

(చదవండి: నష్టా‍ల్లో రామ్‌ చరణ్‌ బిజినెస్‌, నిలిచిపోయిన సేవలు)

మరిన్ని వార్తలు