కస్టమర్లకు అలర్ట్ : ఉద్యోగుల స్ట్రైక్‌..ఆ రోజు పని చేయని బ్యాంకులు

26 Oct, 2022 17:38 IST|Sakshi

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పెరిగిపోతున్న దాడుల్ని నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వచ్చే నెల 19న ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో స్ట్రైక్‌ జరగనుంది. ఆ రోజు బ్యాంకుల్లో కార్యకలాపాలకు విఘాతం కలగనుంది.

ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌.వెంకటాచలం తెలిపిన వివరాల మేరకు..ఏఐబీఈఏ యూనియన్‌లో యాక్టీవ్‌గా ఉన‍్నారనే కారణంగా బ్యాంకు ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

అందుకు ఊతం ఇచ్చేలా ఏఐబీఏ యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీస్ నుండి తొలగించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకులు అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 

  

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఉద్యోగుల్ని విచక్షణారహితంగా బదిలీ చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సెటిల్‌మెంట్, బ్యాంక్ లెవల్ సెటిల్‌మెంట్‌ను ఉల్లంఘిస్తూ 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్‌కు బదిలీ చేశారన్నారని అన్నారు. పై వాటన్నింటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం చెప్పారు.

చదవండి👉 హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త

మరిన్ని వార్తలు