Statistics Survey: ధనిక, పేదల మధ్య భారీ అంతరం

17 Sep, 2021 07:53 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ధనిక, పేదల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 10 శాతం పట్టణ వాసుల్లో సగటున ఒక్కో కుటుంబం వద్ద 1.5 కోట్ల మేర ఆస్తులు ఉండగా.. దిగువనున్న పేదల వద్ద రూ.2,000 (ఒక్కో కుటుంబం) మించి లేదు. 

జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన ‘ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వే 2019’లో ఈ వివరాలు తెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి పట్టణాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. అగ్రస్థాయి 10 శాతం కుటుంబాల వద్ద సగటున రూ.81.17 లక్షల ఆస్తులు ఉంటే.. పేద కుటుంబాల సగటు ఆస్తి రూ.41,000గా ఉంది. 

ఈ విధంగా చూస్తే పట్టణాల కంటే పల్లెల్లోనే పెదల పరిస్థితి కాస్త మెర్గుగా ఉందని ఈ సర్వే పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య 77వ జాతీయ శాంపిల్‌ సర్వేలో భాగంగా ఎన్‌ఎస్‌వో ఈ వివరాలను  సమీకరించింది. 

మరిన్ని వార్తలు