స్వీడన్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలో ఆల్‌కార్గోకు వాటాలు 

31 Jul, 2021 04:40 IST|Sakshi

నార్డికాన్‌ గ్రూప్‌లో 65 శాతం వాటా సొంతం 

ముంబై: స్వీడన్‌కు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ నార్డికాన్‌ గ్రూపులో 65 శాతం వాటాలను కొనుగోలు చేసినట్టు ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ ప్రకటించింది. నార్డిక్స్‌ ప్రాంతంలో (డెన్మార్క్, నార్వే, స్వీడన్‌తో కూడిన ఉత్తర యూరోప్‌) రైల్‌ కన్సాలిడేషన్‌ విభాగం, ఎల్‌సీఎల్‌లో నార్డిక్స్‌ గ్రూపు మార్కెట్‌ లీడర్‌గా ఉంది.  బెల్జియం అనుబంధ సంస్థ ఆల్‌కార్గో బెల్జియమ్‌ రూపంలో వాటాలను కొనుగోలు చేసినట్టు ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ తెలిపింది. 2003లో ఈసీయూ వరల్డ్‌వైడ్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆల్‌కార్గోకు ఇది మూడో కొనుగోలు కావడం గమనార్హం. 2019లో రూ.416 కోట్లతో గతి సంస్థలోనూ వాటాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. మార్కెట్‌ ఆధిపత్యాన్ని కొనసాగించడంతోపాటు.. కొత్త ప్రాంతాలకు విస్తరించే వ్యూహంలో భాగమే ఈ కొనుగోలు అని ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ గ్రూపు చైర్మన్‌ శశికిరణ్‌ శెట్టి తెలిపారు.

మరిన్ని వార్తలు