కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు  

24 Aug, 2022 08:19 IST|Sakshi

 అనిల్‌ అంబానీకి ఐటీ ప్రాసిక్యూషన్‌ నోటీసులు

న్యూఢిల్లీ: బ్లాక్‌ మనీ చట్టం కింద పారిశ్రామికవేత్త రిలయన్స్‌ గ్రూప్‌ (అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీని ప్రాసిక్యూట్‌ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్‌ ఖాతాల్లో రూ. 814 కోట్ల మేర రహస్యంగా దాచిన నిధులపై రూ. 420 కోట్ల పన్నులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని అభియోగాలు మోపింది. ఆయన కావాలనే విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించలేదని ఆరోపించింది.

(భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి)

దీనికి సంబంధించి ఆగస్టు తొలినాళ్లలో ఐటీ శాఖ అంబానీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 2012-13 నుంచి 2019-20 అసెస్‌మెంట్‌ సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి విదేశాల్లోని అసెట్లను వెల్లడించక పోవడం ద్వారా అనిల్‌ అంబానీ పన్నులు ఎగవేశారని పేర్కొంది. ఆగస్టు 31లోగా అభియోగాలపై సమాధానమివ్వాలని సూచించింది. డైమండ్‌ ట్రస్ట్, నార్తర్న్‌ అట్లాంటిక్‌ ట్రేడింగ్‌ అన్‌లిమిటెడ్‌ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థల కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్‌ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి.  

చదవండి : అదానీ గ్రూప్‌ చేతికి ఎన్‌డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!

మరిన్ని వార్తలు