రూ.999 కే విమాన టికెట్‌: ఏయే రూట్లలో?

13 Mar, 2021 13:12 IST|Sakshi

ఎయిరిండియా  అలయన్స్ ఎయిర్  సమ్మర్‌ బొనాంజా

60వేల టికెట్లపై తగ్గింపు ధరలు

నేటి నుంచి  సోమవారం వరకు

సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ  ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్  విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది. తగ్గింపు  రేట్లలో  60 వేల విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  999 రూపాయల నుంచి టికెట్‌ ధరలు ప్రారంభం.

ఈ మూడు  రోజుల అమ్మకపు కాలం శనివారం (మార్చి 13) నుండి ప్రారంభమై మార్చి 15 వరకు అందుబాటులో ఉంటుంది.  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.  సీట్లున్నంతవరకు టికెట్లు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వర్తించనుంది. ఢిల్లీ-జైపూర్/ప్రయాగ్‌రాజ్‌, హైదరాబాద్-బెలగాం, అహ్మదాబాద్ -కాండ్లా, బెంగళూరు-కొచ్చి /కాజీకోడ్‌  వంటి పలు  నగరాలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బయలుదేరడానికి ఒక వారం ముందు  తేదీని ఉచితంగా మార్చకోడానికి కూడా అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు