సుంద‌ర్‌పిచాయ్‌పై మీమ్స్ జోరు, బార్డ్‌ విడుదలపై వెనక్కి తగ్గిన గూగుల్‌!

14 Feb, 2023 16:21 IST|Sakshi

గూగుల్‌ బార్డ్‌ టూల్‌ విడుదలలో మరింత ఆలస్యం కానుంది. యూజర్లు వినియోగించేలా సన్నంద్ధం చేయలేదని, కాబట్టే ఇంకా విడుదలకు నోచుకోలేదని ఆల్ఫా బెట్‌ చైర్మన్‌ జాన్ హెన్నెస్సీ అన్నారు.   

మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జీపీటీకి పోటీగా ఏఐ ఆధారిత  ‘బార్డ్‌’ చాట్‌బాట్‌ టూల్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ముందుగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే గూగుల్ బార్డ్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌ విడుదల కోసం రూపొందించిన ప్రమోషనల్‌ వీడియోలో తప్పిందం జరిగింది. ఆ తప్పిదం కారణంగా  గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది.

దీంతో కంపెనీలోని ఉద్యోగులు సీఈవో సుందర్‌ పిచాయ్‌ తీరును తప్పుబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆల్ఫాబెట్‌ ఛైర్మన్‌ బాట్ విడుదలపై స్పందించారు. పెట్టుబడుల సంస్థ సెలెస్టా కేపిటల్‌ కాల్ఫిపోర్నియా వేదికగా సమ్మిట్‌ను నిర్వహించింది. ఆ సమ్మిట్‌లో జాన్ హెన్నెస్సీ బార్డ్‌పై స్పందించారు. బార్డ్‌ అద్భుతమైన టెక్నాలజీ. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఒకటి నుండి రెండు సంవత్సరాల సమయం పడుతుందని అన్నారు.  

 జేమ్స్ వెబ్‌ టెలిస్కోప్‌ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్‌ తప్పుగా సమాధానం ఇవ్వడంపై ఆల్ఫాబెట్‌ షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఈ సమ్మిట్‌లో మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ కంటే ముందుగా బార్డ్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో గూగుల్‌ తొందర పడిందనే విషయాన్ని హెన్నెస్సీ అంగీకరించారు. బార్డ్‌ ఇప్పటికీ తప్పుడు సమాధానాలను ఇస్తున్నందున బార్డ్‌ విడుదలలో గూగుల్‌ నిధానంగా వ్యవహరిస్తుందని హెన్నెస్సీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు