రెండో సారి ఉద్యోగుల్ని తొలగించిన ఆల్ఫాబెట్‌.. ఈసారి ఎంతమందంటే?

3 Mar, 2023 12:38 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం భయాలతో దిగ్గజ కంపెనీలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ఖర్చల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఆల్ఫాబెట్‌ Waymo (వేమో) ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. 

ప్రపంచ దేశాల్లో టెక్‌ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ముమ్మరం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌.. ‘వేమో’ పేరుతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల ప్రాజెక్ట్‌పై పనిచేస్తుంది. అయితే కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా ఆల్ఫాబెట్‌..  వేమోలో  8 శాతం వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించేందుకు సిద్ధమైంది. 2వ విడత ఉద్యోగుల లేఆఫ్స్‌తో  ఆ సంస్థలో 137 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. కమర్షియల్‌ అంశాలపై దృష్టిసారించిన ఆల్ఫాబెట్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు వేమోకు చెందిన 209 మంది ఉద్యోగులపై వేటు వేసింది. 

గూగుల్‌లో లే ఆఫ్స్‌ 
కాగా ఆల్ఫాబెట్‌ ఇప్పటికే గూగుల్‌ ఉద్యోగులకు భారీ ఎత్తున పింక్‌స్లిప్‌లు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 12వేల మందిని ఫైర్‌ చేయగా.. వారిలో భారత్‌కు చెందిన 400మంది ఉద్యోగులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు