Amazon: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి చెందిన కంపెనీను కైవసం చేసుకున్న అమెజాన్‌..!

22 Dec, 2021 20:24 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌,  ఇన్ఫోసిస్‌  సహ  వ్యవస్థాపకులు నారాయణమూర్తికి చెందిన కాటమరాన్ వెంచర్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సర్సీస్‌ను పూర్తిగా అమెజాన్‌ సొంతం చేసుకుంది. క్లౌడ్‌టైల్‌లోని కాటమరాన్ వెంచర్ వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి కోరింది. కాటరామన్‌కు చెందిన పూర్తి వాటాలను కొనుగోలు చేసినట్లు అమెజాన్‌ బుధవారం రోజున ప్రకటించింది.

క్లౌడ్‌టైల్‌ కంపెనీలో అంతకుముందు అమెజాన్‌ 24 శాతం మేర, కాటరామన్‌ 76 శాతం మేర వాటాలను కల్గి ఉంది. ఇప్పుడు కాటరామన్‌కు చెందిన పూర్తి వాటాలను అమెజాన్‌ ఇండియా కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇటీవల క్లౌడ్‌టైల్‌ ఇండియా మే 2022 కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.  

ఇరు సంస్థలు ఇకపై జాయింట్‌ వెంచర్‌గా కొనసాగబోవని అప్పట్లో ప్రకటించాయి. నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే ఇక ప్రియోన్‌ పూర్తిగా అమెజాన్‌ చేతిలోకి వెళ్లనుంది. యాజమాన్యంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు.

చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్‌..!

మరిన్ని వార్తలు