Amazon: ప్రైమ్‌ యూజర్లకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన అమెజాన్‌..!

4 Oct, 2021 18:57 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి  ప్రారంభమైంది. తాజాగా ప్రైమ్‌ యూజర్లకు అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రైమ్‌ యూజర్లకు ‘ అడ్వాన్‌టేజ్‌ జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను లాంచ్‌ చేసింది.
చదవండి:75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్‌ బచ్చన్‌ ఎంట్రీ...!

అడ్వాన్‌టేజ్‌ జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌ ప్రోగ్రాం సహాయంతో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ప్రైమ్ సభ్యులకు నో కాస్ట్‌ ఈఏమ్‌ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కేవలం స్మార్ట్‌ఫోన్లకే వర్తించనుంది. దాంతో పాటుగా స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై  అదనంగా కస్టమర్లు ఆరు నెలల ఉచిత స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చును. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారుల కోసం మరిన్నీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందించనుంది.

అమెజాన్ అందిస్తోన్న 'అడ్వాంటేజ్ - జస్ట్ ఫర్ ప్రైమ్' ప్రోగ్రామ్ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లైన సామ్‌సంగ్ గెలాక్సీ M52 5జీ , ఐక్యూ జెడ్‌5, షావోమీ 11 లైట్‌ 5G ఎన్‌ఈ, ఒప్పో ఏ55 నో కాస్ట్‌ ఈఎమ్‌ఐలను అందిస్తోంది. నెల రోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ల్యాప్‌టాప్‌లు , స్మార్ట్ టీవీలు , మొబైల్ ఫోన్‌లు , ఎయిర్ ప్యూరిఫైయర్‌లు , గృహోపకరణాలు , వంటగది ఉపకరణాలు మరిన్నింటిపై అమెజాన్‌ డిస్కౌంట్లను అందిస్తోంది .
చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్‌...!

మరిన్ని వార్తలు