Amazon Summer Sale 2022: అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌ వచ్చేసింది! 75శాతం భారీ డిస్కౌంట్‌లు!

4 May, 2022 13:27 IST|Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. 'అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌-2022' పేరిట మే4 నుంచి మే7వరకు నిర్వహించే  సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌ ప్రొడక్ట్‌పై 75శాతం, డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించడం ద్వారా అదనంగా మరికొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది

నేటి నుంచి అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌ సందర్భంగా కొనుగోలు దారులు స్మార్ట్‌ ఫోన్స్‌, ల్యాప్‌ట్యాప్స్‌, గృహోపకరణాలు, దుస్తులు, హెడ్‌ఫోన్స్‌,ఇయర్‌ ఫోన్స్‌ బ్రాండ్స్‌ బోట్‌, సోనీ, స్కల్‌ క్యాండీ,జేబీఎల్‌, రియల్‌మీ, నాయిస్‌, వన్‌ ప్లస్‌తో పాటు ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌కే అందిస్తుంది.   

కార్డ్‌లపై ఆఫర్లు ఎలా ఉన్నాయ్‌
అమెజాన్‌ సంస్థ ఈసేల్‌ సందర్భంగా పలు బ్యాంక్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొనుగోలు దారులు ఈ సేల్‌లో ఐసీఐసీఐ, కొటాక్‌, ఆర్బీఎల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌లను వినియోగిస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్‌, జీరో కాస్ట్‌ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొత్త యూజర్లు తొలిసారి కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తుంది. 

60ప్రొడక్ట్‌లు అందులో..
ఈ సేల్‌లో అమెజాన్‌ 60రకాల ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచింది. దుస్తులు, షూస్‌, బ్యాగ్స్‌, కిచెన్‌ అప్లయెన్సెస్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌ తో పాటు ఇటీవల విడులైన 5జీ స్మార్ట్‌ ఫోన్‌ వన్‌ ప్లస్‌ 10ఆర్‌ అందుబాటులో ఉంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ బెన్ఫిట్స్‌
అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు అమెజాన్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రైమ్‌ మెంబర్లు 1000 ఆఫర్లు ఉన్నాయని, ఎక్స్‌ క్లూజివ్‌గా ఈ ఆఫర్లు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు వినియోగించుకోవచ‍్చని, అమెజాన్‌ పే ఐసీఐసీఐ కార్డ్స్‌పై రివార్డ్‌లను దక్కించుకోవచ్చని ఈకామర్స్‌ దిగ్గజం ప్రకటించింది. 

అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌ ఆఫర్స్‌ 
ఎక్స్‌క్లూజీవ్‌గా అమెజాన్‌ నిర్వహిస్తున్న ఈ అమ్మకాల్లో స్మార్ట్‌ ఫోన్‌లు,యాక్ససరీస్‌, ల్యాప్‌ ట్యాప్స్‌ పై 40శాతం భారీ డిస్కౌంట్‌తో పాటు, నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. ఫ్యాషన్‌ యాక్ససరీస్‌,దుస్తులు,గృహోపకరణాలపై మరిన్ని అఫర్లు ఉన్నాయి. ఇక  హెడ్‌ఫోన్స్‌,ఇయర్‌ ఫోన్స్‌పై 70శాతం డిస్కౌంట్‌ అందిస‍్తున్నట్లు అమెజాన్‌ స్పష్టం చేసింది. 

చదవండి👉భావన.. పక్కా పల్లెటూరి పిల్ల జీతం రూ.40 లక్షలు

మరిన్ని వార్తలు