అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌: ఉద్యోగులకు భారీ ఎత్తున క్యాష్‌ ఫ్రైజ్‌, ఉచితంగా కొత్త కార్లు

8 Aug, 2021 12:06 IST|Sakshi

ఉద్యోగులకు అమెజాన్‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.వ్యాక్సిన్‌ వేయించుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్‌ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతుల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.రెండు నెలల క్రితం వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి మాస్క్‌ అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రజలు  మాస్క్‌లు లేకుండా, కోవిడ్‌-19 నిబంధనల్ని ఉల్లంఘించడంతో మరోసారి కరోనా విజృభించింది 

అయితే 'మాస్క్‌ ఫ్రీ' ప్రకటనతో కరోనా ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకు కనీసం లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కావడంతో పాటు.. వందల సంఖ్యలో డెల్ట్‌ వేరియంట్‌ బాధితులు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇప్పటికే మాస్క్‌ ఫ్రీ అని ప్రకటించిన అమెజాన్‌ దిద్దుబాటుకు చర్యలు తీసుకుంది. అమెజాన్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు చెందిన లాజిస్టిక్స్‌ సెంటర్‌లో పనిచేస‍్తున్న తొమ్మిది మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ వేయించుకోలేదు.పైగా మాస్క్‌ లేకుండా తిరగడం వల్ల.. సహోద్యోగులు కరోనా భారిన పడ్డారు.

దీంతో అప్రమత్తమైన అమెజాన్‌ వ్యాక్సిన్‌ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. 'మ్యాక్స్‌ యువర్‌ వ్యాక్స్‌' లో భాగంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఉద్యోగులకు బహుమతుల్ని ప్రకటించనుంది. ఇందుకోసం రూ.14.9కోట్లను కేటాయించిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తూ.. డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికి రూ.3.7కోట్లను అమెజాన్ అందించనుందని తెలిపింది. తర్వాత ఆరుగురికి రూ. 74లక్షలు, మరో ఐదుగురికి కార్లు, వెకేషన్ ప్యాకేజీలను అందించనుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. 

ఫ్రంట్‌ లైన్‌ వర్క్‌ర్లు అంటే అమెజాన్‌లోని కాకుండా ఆ సంస్థకు అనుసంధానంగా ఉన్న ఆర్డర్లు స్టోర్‌ చేసే గోడౌన్స్‌, హోల్‌ సేల్‌ మార్కెట్లు, ఫ్రెష్‌ గ్రాసరీ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులతో పాటు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని బ్లూమ్‌ బర్గ్‌ తెలిపింది. మరి కాంటెస్ట్‌ ను ఎంతమంది ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగులకు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు