‘టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రమాదం ముందుంది’.. జెఫ్ బెజోస్ షాకింగ్‌ వ్యాఖ్యలు!

19 Nov, 2022 14:22 IST|Sakshi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని, మాం​ద్యం ముప్పు ముంచుకొస్తోందని ప్రజలు అందుకు తగ్గట్టు సన్నద్ధంగా ఉండాలని ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు ప్రజలకు దూరంగా ఉండాలన్నారు. ఇకపై డబ్బులు దాచుకోవాలన్న బెజోస్‌, టీవీ ,ఫ్రీజ్‌, కారు కొనాలనే ఆలోచన ఉంటే వాటిని దూరంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు నగదుని మీ వద్దే ఉంచుకునేందుకు ప్రయత్నించాలని చెప్పారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా కనిపించడం లేదు. దీని ప్రభావమే అనేక రంగాలలో ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే చిరు వ్యాపారులు తమ వద్ద నగదు నిల్వ ఉంచుకొని.. కొత్త వస్తువుల కొనుగోలు నిలిపి వేయాలని సూచించారు.కాగా, బెజోస్ తన సంపదలో సింహ భాగం సమాజ సేవకు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ విలువ $123.9 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి.

చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద రూ.50వేల వరకు రుణాలు!

మరిన్ని వార్తలు