Amazon ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు, కీలక నిర్ణయం

18 Nov, 2022 10:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్  ఉద్యోగాల కోతకు సంబంధించి మరో సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది(2023)లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుందని అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ గురువారం తెలిపారు. ఈ మేరకు అమెజాన్ ఉద్యోగులకు  సీఈవో ఒక లేఖ రాశారు. 

అమెజాన్‌ ఉద్యోగులకు పంపిన నోట్‌లో  జస్సీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కార్పొరేట్ ర్యాంక్‌లలో ప్రారంభమైన భారీ తొలగింపులు వచ్చే ఏడాది దాకా  కొనసాగుతాయని జస్సీ తెలిపారు. సుమారు ఒకటిన్నర సంవత్సరాల్లో ఎపుడూ ఇంత కఠినమైన నిర్ణయం ఇదే తొలిసారని, గత రెండు రోజులుగా చాలా కఠిన ఆదేశాలిచ్చామని తెలిపారు. (2021లో అమెజాన్‌ సీఈవోగా జస్సీ బాధ్యతలను చేపట్టారు)  కంపెనీ వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష మధ్యలో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోప్రతి వ్యాపారంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.  అయితే తమ తాజా నిర్ణయం ద్వారా ఎన్ని ఉద్యోగాలు ప్రభావితమవుతాయనే విషయాన్ని అమెజాన్   సీఈవో ధృవీకరించ లేదు.  (ట్విటర్‌కు షాక్‌: ‘కూ’ దూకుడు, మస్క్‌కు నిద్ర కరువే!)

ఆర్థికమాంద్యం, పడిపోతున్న కంపెనీ ఆదాయాలు నేపథ్యంలో అమెజాన్, గత కొన్ని నెలలుగా తన వ్యాపారంలోని వివిధ రంగాల్లో ఖర్చులను తగ్గించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. (మస్క్‌ 13 కిలోల వెయిట్‌ లాస్‌ జర్నీ: ఫాస్టింగ్‌ యాప్‌పై ప్రశంసలు)

మరిన్ని వార్తలు