Jeff Bezos: కొంపముంచిన అంతరిక్ష యాత్ర...!

13 Aug, 2021 20:45 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ బ్లూఆరిజిన్‌ రాకెట్‌ ద్వారా అంతరిక్షయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే.  రోదసి యాత్ర విజయవంతమైనందుకు గాను జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ‍్క్షతలను తెలిపారు. కాగా రోదసీయాత్ర పూర్తి చేసుకున్న జెఫ్‌బెజోస్‌పై కొంత మంది మండిపడుతున్నారు. జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయాత్రను పన్నులు కట్టకుండా డబ్బులను సంపాదించారని  సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర కొంపముంచుతుంది. తాజాగా బెజోస్‌ అంతరిక్షయాత్రకు వ్యతిరేకంగా పలువురు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  జెఫ్‌ బెజోస్‌ తన అంతరిక్షయాత్ర కోసం అమెజాన్‌ కస్టమర్ల,  ఉద్యోగుల డబ్బులను వాడి వెళ్లి వచ్చారనే అభిప్రాయాన్ని నెటిజన్లు సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌చేస్తున్నారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు.

ప‌న్నులు క‌ట్ట‌కుండా అమెరిక‌న్లు చెమ‌టోడ్చి సంపాదించి క‌ట్టిన ప‌న్నుల‌తోనే స్పేస్‌ టూర్‌ చేసి వచ్చారని నెటిజన్లు ఎద్దెవా చేస్తున్నారు.  జెఫ్ బెజోస్ గత నెలలో జూలై 20 న 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ పదకొండు నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం 16 లక్షల డాలర్లు ఖర్చు  చేశారని నెటిజన్లు దుయ్యబట్టారు.

అంతరిక్షయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజులకే జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం నుంచి జెఫ్‌ బెజోస్‌ వైదొలిగాడు. బెజోస్‌ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్‌ విట్టన్‌ మోయెట్‌ హెన్నెస్సీ(ఎల్‌వీఎమ్‌హెచ్‌) అధినేత బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ 200.5 బిలియన్‌ డాలర్లతో ముందున్నారు. జెఫ్‌ బెజోస్‌ 190.7 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు