అమెజాన్, ఫ్లిప్ కార్టుల‌పై చ‌ర్య‌ల‌కు కేంద్రం ఆదేశాలు

31 Dec, 2020 20:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌పై చ‌ర్య‌ల‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్‌, వాల్‌మార్ట్ యాజ‌మాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను కేంద్రం ఆదేశించింది. ఈ కంపెనీలు ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999(ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించినందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) చేసిన పలు ఫిర్యాదుల కారణంగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్‌ ఇదే..!)

వివిధ కంపెనీల‌కు ఇ-కామ‌ర్స్ సంస్థ‌లకు మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలో బ్రాండ్ రిటైలింగ్ పేరుతో ఏ విదంగా ఎఫ్‌డీఐ పాల‌సీ, ఫెమా చ‌ట్టాల‌ను ఉల్లంఘించాయో తెలియ‌జేస్తూ సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార‌తీయ‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌వీణ్ ఖండేల్‌వాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ)‌, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందంలో తయారీలో ఎఫ్‌డీఐ విధానాన్ని ఉల్లంఘించడంతో పాటు వివిధ ఇ-కామర్స్ కంపెనీలు మల్టీ-బ్రాండ్ రిటైలింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు డిపిఐఐటి నాలుగు ఫిర్యాదులను పంపిందని సిఐఐటి తెలిపింది.  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఫెమా, ఎఫ్‌డిఐ పాలసీలో ఉన్న లొసుగుల ద్వారా చట్టాన్ని ఉల్లంఘించినట్లు సీఏఐటీ తెలిపింది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు