అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌

28 Oct, 2022 16:24 IST|Sakshi

అమెజాన్‌ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్‌ తగిలింది. బెజోస్‌ 23 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. కొనసాగుతున్న సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్‌. కామ్ సేల్స్‌ తగ్గిపోయాయి. ఆ ప్రభావంతో మదుపర్లు అప్రమత్తం కావడంతో ట్రేడింగ్‌లో షేర్లు క్షీణించడంతో బెజోస్‌ సంపద కరిగిపోయింది. 

బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం...బెజోస్‌ ఇంత భారీ మొత్తంలో కోల్పోవడంతో..చరిత్రలో క్షీణించిన సంపద జాబితాలో నిలించింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత స్టాక్ దాదాపు 21 శాతం పడిపోయింది. పెట్టుబడి దారులు టెక్నాలజీ స్టాక్‌లలో భారీగా పెట్టుబుడుల పెట్టడంతో ఆ ప్రభావం అమెజాన్‌పై పడింది. దీంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి  అతని సంపద ఈ సంవత్సరం $58 బిలియన్లకు పైగా పడిపోయింది.

చదవండి👉 700మందికి చుక్కలు చూపిస్తున్న జోబైడెన్‌ ..వారిలో ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ కూడా!

మెటా అదినేత మార్క్ జూకర్‌బర్గ్, ఎలాన్ మస్క్, చాంగ్‌పెంగ్ జావో మాత్రమే ఇంతకుముందు భారీ ఎత్తున నష్టపోయారు. ఇలాగే బెజోస్ తన సంపదను కోల్పోతుంటే పైన పేర్కొన్న జాబితాలో ఒకరిగా నిలవనున్నారు. కాగా, అమెజాన్‌.కామ్‌ స్టాక్ 2022లో దాదాపు 33 శాతం పడిపోయాయి. అలాగే, ఆగస్ట్ ఫైలింగ్ ప్రకారం..బెజోస్ అమెజాన్‌లో దాదాపు 996 మిలియన్ షేర్లను కలిగి ఉన్నారు.

చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’!

మరిన్ని వార్తలు