Amazon: అమెజాన్‌ మరో సేల్‌..! ఈసారి ల్యాప్‌ట్యాప్‌, టీవీలపై భారీ తగ్గింపు...!

22 Aug, 2021 17:49 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన కస్టమర్లకోసం మరో సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది.  అమెజాన్ ఇండియా 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్టు​ 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్‌ గేమింగ్‌ సేల్స్‌లో భాగంగా ల్యాప్‌టాప్స్‌, టీవీలు  డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్‌, ఎల్‌జీ, హెచ్‌పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్‌ టీవీలకు ఆఫర్లు, డీల్స్‌ను అమెజాన్‌ తన కస్టమర్లకు ఆఫర్‌ చేయనుంది.
చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!

డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్‌ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్‌, అధిక రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్‌ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్‌ ఈఎమ్‌ఐ, ఎక్సేఛేంజ్‌ ఆఫర్‌లను కూడా పొందవచ్చును. 

పలు ల్యాప్‌టాప్‌లపై అమెజాన్‌ అందిస్తోన్న ఆఫర్‌లు

  • హెచ్‌పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది.
  • ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్‌515-56 గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 69,990  అందుబాటులో ఉంది .
  • ఎమ్‌ఎస్‌ఐ కంపెనీకి చెందిన  బ్రావో 15 ఎఫ్‌హెచ్‌డీ మోడల్‌ను రూ. 74,990  అందుబాటులో ఉంది.
  • లెనోవా ఐడియా ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ను రూ . 67, 557 కు లభించనుంది. 

పలు టీవీలపై అమెజాన్‌ అందిస్తోన్న ఆఫర్‌లు..

  • సోనీ బ్రావీయా 55 ఇంచ్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ రూ. 83,990కు అందుబాటులో ఉండనుంది.
  • రెడ్‌మీ 55 ఇంచ్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీను రూ . 45,999కు అందుబాటులో ఉండనుంది.

చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు