గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌.. అదిరిపోయే ఆఫర్లతో పండగే పండగ

5 Aug, 2021 13:24 IST|Sakshi

ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఆఫర్ల పండుగ మొదలైంది. పంద్రాగస్ట్‌ను పురస్కరించుకొని అమెజాన్‌ ఆగస్ట్‌ 5 నుంచి ఆగస్ట్‌ 9 వరకు 'అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌' ను అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళమీరు జులైలో జరిగిన ప్రైమ్‌ డేల్‌ సేల్‌ మిస్‌ అయితే.. ఈ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో గాడ్జెట్స్‌ తో పాటు ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌ పై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఈ సేల్‌ సందర్భంగా కష్టమర్లకు ఆఫర్లను అందించేందుకు అమెజాన్‌ ఎస్‌బీఐతో టై అప్‌ అయ్యింది. ఎస్‌బీఐ క్రెడిట్‌  కార్డ్‌ ద్వారా ఈ సేల్‌ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే  ( గరిష్టంగా రూ.1750) కొనుగోలు చేస్తే 10 డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ తో పాటు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో స్మార్ట్‌ ఫోన‍్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం. 

ఆపిల్‌ ఐఫోన్‌ 11
అమెజాన్‌ సేల్‌ లో ఆపిల్ ఐఫోన్‌ రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.54,900 ఉండగా.. ఆఫర్‌ లో రూ.4,500 తగ్గుతుంది. దీంతో పాటు అమెజాన్‌ ఎక్సేంజ్‌ ఆఫర్‌ లో రూ.13,400 తగ్గింపుతో ఐఫోన్‌ 11ను కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు కోసం పేరొందిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగిస్తే నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ ను లభిస్తోంది.

ఆపిల్‌ ఐఫోన్‌ 12 
రూ.79,900విలువైన ఆపిల్‌ ఐఫోన్‌ 12ను ఈ ఆఫర్‌ లో 11,901 తగ్గుతుంది. ఒకవేళ మీ వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే.. ఎక్సేంజ్‌ ఆఫర్‌లో  రూ.13,400 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.వీటితో పాటు వన్‌ ప్లస్‌ 9జీ, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 20, నోకియా జీ 20 స్మార్ట్‌ ఫోన్లపై అఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

అమెజాన్‌ బ్రాండ్లపై ఆఫర్లు 
అమెజాన్‌కు చెందిన డివైజ్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, కిండ్లే ఈ బుక్‌ రీడర్స్‌ పై ఆఫర్లు లభిస్తాయి. వీటితో పాటు 

యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ

సోనీ డబ్ల్యూహెచ్‌ ఎక్స్‌ఎం3 వైర్‌ లెస్‌ హెడ్‌ ఫోన్‌

ఆపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ ప్రో

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 

ఆపిల్‌ ఐపాడ్‌ ఎయిర్‌ 2020

హెచ్‌ పీ పెవిలియన్ గేమింగ్‌ ల్యాప్‌ ట్యాప్‌లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు