అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్

1 Oct, 2021 17:18 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు దసరా పండుగ పురస్కరించుకుని మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా శామ్‌సంగ్, ఆపిల్, వన్‌ప్లస్, ఎంఐ, రెడ్ మీ మొబైల్స్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. తాజాగా మొబైల్ ఆఫర్లకు సంబంధించి అమెజాన్ టీజ్ చేసింది. 2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ రూ.40 వేలలోపు ధరకే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ తన అధికారిక మైక్రోసైట్లో పేర్కొంది. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రూ.70,499 నుంచి రూ.36,999కు తగ్గించారు. 

అలాగే, దీంతోపాటు వన్‌ప్లస్ 9 నార్డ్ 2 5జీ ఫోన్ ధర రూ.28,499 నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ 9 ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. రూ.36,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐకూ జెడ్3 రూ.15,490 నుంచి ప్రారంభం కానుంది. రెడ్‌మీ 9 స్మార్ట్ ఫోన్ ధర రూ.7,920కు తగ్గనుంది. రెడ్‌మీ నోట్ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,990కు తగ్గనుంది. ఇంకా వన్‌ప్లస్‌ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అమెజాన్‌లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లపై అయితే తగ్గింపు లేదా బ్యాంకు ఆఫర్లు వర్తించనున్నాయి. దీంతోపాటు ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటే మరిన్ని ఆఫర్లు అందించనున్నాయి. (చదవండి: భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు