Amazon Great Indian Festival Sale: బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌తో..అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌

19 Sep, 2021 19:29 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ త్వరలోనే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను జరపనుంది. గ్రేట్‌ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను అమెజాన్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో టీజ్‌ చేసింది. ఈ సేల్‌ తేదీలను అమెజాన్‌ ఇంకా ఖరారు చేయలేదు.  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్‌ ప్రకటించడం విశేషం. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ మొదటి వారంలో ఈ సేల్‌ను అమెజాన్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ..?


అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ 24 గంటలకు ముందే ఈ సేల్‌లో పాల్గొనవచ్చును. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 30 శాతం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 80 శాతం వరకు, ఫ్యాషన్‌పై సుమారు 40 శాతం నుంచి 80 శాతం మేర ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందించనుంది.

ఫ్యాషన్‌ ఉత్పత్తుల కొనుగోలు అదనంగా రూ. 300 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఫ్రీ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను అందించనుంది.  ఫైర్‌ టీవీ స్టిక్‌, ఎకో డివైజెస్‌, కిండెల్‌ లాంటి అమెజాన్‌ ఉత్పత్తులపై భారీ  తగ్గింపును అందించనుంది. 

చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!

మరిన్ని వార్తలు