అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం

20 Jan, 2021 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ రిపబ్లిక్ డే సందర్బంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(జనవరి 20) నుంచి జనవరి 23 వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల సేల్ లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, అమెజాన్ పరికరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ పై మంచి ఆఫర్స్ అందిస్తోంది. అమెజాన్‌ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రస్తుతం లైవ్ లో ఉంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. ఎస్బిఐ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం(కార్డుపై రూ.1,500 వరకు) తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ఒప్పందాలు, ఆఫర్‌లు మీకోసం.(చదవండి: మొదలైన ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్)  

ఆపిల్ ఐఫోన్ 12 మినీ: 
ఆపిల్ ఐఫోన్ 12 మినీపై అమెజాన్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం లేదు, కాని ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ ఫోన్‌పై రూ.4,500(అసలు రూ.64,490) డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.12,400(గరిష్టంగా) అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. 

వన్‌ప్లస్ 8:
వన్‌ప్లస్ 8 అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అమ్మకంలో రూ.39,999(ఎంఆర్‌పి రూ.41,999)కి లభిస్తుంది. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.12,400(గరిష్టంగా) అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4,300ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం51:
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అమ్మకంలో శామ్సంగ్ గెలాక్సీ ఎం51పై కూపన్ లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఆ ప్రోడక్ట్ కింద రూ.2,000 చెక్ బాక్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు గెలాక్సీ ఎం51ను రూ.20,999 (ఎంఆర్‌పి రూ.28,999)కి పొందవచ్చు. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా కొనుగోలుపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. గెలాక్సీ ఎం51 6.7-అంగుళాల ఎస్ఆమోఎల్ఈడి ప్లస్ డిస్‌ప్లే, 7,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రెడ్‌మి నోట్ 9ప్రో మాక్స్:
షియోమీకీ చెందిన రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.14,999(ఎంఆర్‌పి రూ.18,999). అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.12,400(గరిష్టంగా) అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9ప్రో మాక్స్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు