ప్రైమ్‌ యూజర్లకు బిగ్ షాక్‌.. అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే

24 Sep, 2023 13:19 IST|Sakshi

యూజర్లకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ భారీ షాక్‌ ఇవ్వనుంది. ఓటీటీ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు అమెజాన్‌లో నచ్చిన సినిమా, వెబ్‌ సిరీస్‌లను వీక్షించే సమయంలో ప్రసారమయ్యే యాడ్స్‌ను స్కిప్‌ చూసే వెసలు బాటు ఉండేది. కానీ ఇకపై యాడ్స్‌ను స్కిప్‌ చేయాలంటే యూజర్ల నుంచి  డబ్బులు వసూలు చేయాలని అమెజాన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

2024 ప్రారంభం నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇక యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ చూడాలనుకునే యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే 
ఇప్పటికే యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ను డిస్నీ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వార్షిక చందా రూ.899 ఉండగా.. యాడ్స్‌ లేకుండా వీక్షించాలంటే సూపర్‌ ప్లస్‌ ప్లాన్‌ రూ.1099 ఎంచుకోవాలి. అంటే అదనంగా రూ.200 చెల్లించాలి. ఇప్పుడు ఇదే పద్దతిని అమెజాన్‌ అనుసరించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికాతో పాటు పలు దేశాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు యాడ్స్‌ లేకుండా సినిమా చూడాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

యూజర్లు ఆదరిస్తారా?
మరో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగానే గత ఏడాది మేలో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 100కు పైగా దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్ పై పరిమితులను విధించింది. ఆ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన యూజర్లు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఎత్తున నష్టాల్ని చవి చూసింది. ఇప్పుడు అమెజాన్‌ సైతం యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ పేరుతో తేనున్న ఈ సరికొత్త కొత్త విధానాన్ని యూజర్లు ఆదరిస్తారా? లేదంటే తిరస్కరిస్తారో? వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు