బెజోస్‌ గురించి ప్రేయసి.. ‘నువ్వు నా పక్కనుంటే చాలు!’

25 Nov, 2021 11:48 IST|Sakshi

ఎంత బిజీ పర్సన్‌ అయినా తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించి తీరాలి కదా! అందుకే అలుపెరగకుండా పని చేసే అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌(57) కూడా వీలుచిక్కినప్పుడల్లా తన ప్రేయసితో విహార యాత్రలకు చెక్కేస్తుంటాడు.
 

‘ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్‌ ఏదో తెలుసా?.. నువ్వు నా పక్క ఉండడం. అది చాలు.’ అంటూ బెజోస్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది బెజోస్‌ ప్రేయసి లారెన్‌ సాన్‌షెజ్‌. పెంపుడు కుక్కతో ఇద్దరూ సరదాగా కయాకింగ్‌ చేస్తున్న ఫొటోల్ని షేర్‌ చేసిందామె. 

A post shared by Lauren Sanchez (@laurenwsanchez)

భార్య(మాజీ) మెక్‌కెంజీ స్కాట్‌తో విడాకుల అనంతరం.. అమెరికా టాప్‌ న్యూస్‌ యాంకర్‌ అయిన లారెన్‌ సాన్‌షెజ్‌(51) ప్రేమాయణం నడిపిస్తున్నాడు బెజోస్‌. విశేషం ఏంటంటే.. ఆమెకి కూడా ఇది రెండో రిలేషన్‌షిప్‌. ఇక మెక్సికన్‌-అమెరికన్‌ అయిన లారెన్‌ 2019 నుంచి బెజోస్‌తో రిలేషన్‌లో ఉంది. జర్నలిజంలో ఎమ్మీ అవార్డు సైతం అందుకున్న లారెన్‌.. హెలికాప్టర్‌ పైలెట్‌ కూడా. ఆమె సంపద విలువ 30 మిలియన్‌ డాలర్లు. 

సీటెల్‌లో పక్కపక్కనే ఇల్లు ఉండడం ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం మొదలైంది . కిందటి ఏడాది జనవరిలో బెజోస్‌ భారత పర్యటన సందర్భంగా ఇద్దరూ కలిసి తాజ్‌ మహల్‌ దగ్గర ఫొటోలు సైతం తీయించుకున్నారు.

చదవండి: తన ప్రేయసితో హీరో డికాప్రియో కబుర్లు.. జెలసీగా బెజోస్‌ 

మరిన్ని వార్తలు