ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్‌ ఇంకా మరెన్నో..

26 Sep, 2021 11:24 IST|Sakshi

Prime Video New Service : అమెరికా, యూరప్‌ దేశాల్లో ఉన్న ప్రత్యేక సర్వీసుని అమెజాన్‌ ఇండియాలో కూడా ప్రవేశపెట్టింది. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫార్మ్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో ఈ సర్వీసు గత శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 

ఓటీటీ బూమ్‌
గత రెండేళ్లుగా ఇండియాలో ఓటీటీ బిజినెస్‌ ఊపందుకుంది. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌వీడియోస్‌, హాట్‌స్టార్‌లకు తోడుగా అనేక సినిమా నిర్మాణ సంస్థలు, టీవీ ఛానల్లు సొంతంగా ఓటీటీలు నెలకొల్పాయి. పోటాపోటీగా ఒరిజినల్‌ కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. దీంతో నచ్చిన వీడియో కంటెంట్‌ చూడాలంటే అనేక ఓటీటీ యాప్‌లకు చందాదారులగా చేరాల్సి వస్తోంది.

ఓకే ప్లాట్‌ఫామ్‌
ప్రైమ్‌ వీడియో వేదికగా ఇతర యాప్‌లను బండిల్‌ ఆఫర్‌గా అమెజాన్‌ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తగా ఇప్పటికే 9 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా ఇండియాలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

లాగిన్‌ సమస్యలుండవు
వ్యక్తిగతంగా ఉపయోగించే ఈ మెయిల్‌ ఐడీల నుంచి పలు సోషల్‌ మీడియా అకౌంట్లు, ఫైనాన్షియల్‌ యాప్‌లు అన్నింటికీ వేర్వేరు యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఉంటున్నాయి. వీటికి తోడు పదుల సంఖ్యలో ఓటీటీ యాప్‌లు కూడా వచ్చి చేరాయి. ఈ పాస్‌వర్డ్‌లు, యూజర్‌ నేమ్‌ల గోల తప్పించేందుకు బండిల్‌ ఆఫర్‌ని అందిస్తున్నట్టు ప్రైమ్‌ వీడియో ఇండియా హెడ్‌ గౌరవ్‌ గాంధీ తెలిపారు. 

బండిల్‌ ఆఫర్‌లో ఉన్నవి ఇవే
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో బండిల్‌ ఆఫర్‌గా ముబీ, డోకుబే, డిస్కవరీ ప్లస్‌, లయన్స్‌గేట్‌ ప్లే, ఈరోస్‌ నౌ, షార్ట్స్‌ ప్లే, హోయ్‌చోయ్‌, మనోరమా మ్యాక్స్‌ వంటి ఇతర ఓటీటీ సేవలు ఉన్నాయి. అయితే ఈ సేవలను యాడ్‌ ఆన్‌ సబ్‌స్క్కిప్షన్‌ పద్దతిలో అందించారు. దీని ప్రకారం ఈ అదనపు వీడియో కంటెంట్‌ చూడాలంటే వేర్వేరుగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బండిల్‌ ఆఫర్‌లో భాగంగా వన్‌ ఇయర్‌ సబ్‌స్క్రిప్షన్‌పై తగ్గింపును అందుబాటులో ఉంచారు. 

చదవండి : మొండి గూగుల్‌.. ఆ ఫోన్లలో కరెక్ట్‌ పాస్‌వర్డ్‌ కొట్టినా వేస్టే! ఎందుకంటే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు