అమెజాన్‌ యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌, ఏడాదికి రూ.599కే

7 Nov, 2022 14:12 IST|Sakshi

ప్రముఖ దిగ్గజ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ యూజర్లకు అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ.599 చెల్లించి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ను  వినియోగించుకోవచ్చని తెలిపింది. 

2016  సెప్టెంబర్‌ 5న జియో రాకతో దేశంలో డేటా విప్లవం మొదలైంది. జియో లాంచ్​కి ముందు.. ప్రతి భారతీయుడు నెలకు 154ఎంబీ డేటాను మాత్రమే వినియోగించేవాడు. జియో లాంచ్​ తర్వత..యూజర్​ నెలకు 15.8జీబీని వినియోగించే అవకాశం కలిగింది.

దీంతో మెట్రో నగరాల నుంచి  గ్రామీణ ప్రాంతాల వరకు అతి తక్కువ ధరకే  మొబైల్‌ రీఛార్జ్‌ (ప్రీపెయిడ్‌) చేసుకొని ఇంటర్నెట్‌ను వాడుకునే సింగిల్‌ యూజర్ల సంఖ్య పెరిగింది. పైగా మన దేశంలో 95 శాతం కుటుంబాలు ఒకే టీవీని కలిగి ఉండటం, మొబైల్స్‌లో వీడియో కంటెంట్‌ను వీక్షించే సంఖ్య పెరుగుతూనే ఉంది. 

ఇప్పుడు ఆ తరహా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ను ప్లాన్‌ను ప్రారంభించింది. తాజాగా ప్లాన్‌లో  సింగిల్‌ స్క్రీన్‌పై ఏడాదికి రూ.599 చెల్లించి లేటెస్ట్‌ మూవీస్‌, క్రికెట్‌ మ్యాచ్‌లు, వెబ్‌ సిరీస్‌ వీక్షించవచ్చు. డెస్క్‌ ట్యాప్‌లో సైతం ప్రైమ్‌ను వీక్షించే సౌకర్యం ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లు ఇప్పటికే ఈ తరహా సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా వాటి జాబితాలో అమెజాన్‌ చేరింది.

చదవండి👉 అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌

మరిన్ని వార్తలు