దిగ్గజాలకు షాక్‌: వొడాఫోన్‌ ఐడియాలో భారీ పెట్టుబడులు?!

30 May, 2022 16:36 IST|Sakshi

 వొడాఫోన్‌ ఐడియాలో రూ. 20 వేల కోట్లు  పెట్టుబడి

ఈ-కామర్స్ దిగ్గజం  దిగ్గజం అమెజాన్‌ భారీ పెట్టుబడులు

సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాలో ఈ-కామర్స్ దిగ్గజం దిగ్గజం అమెజాన్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు  సిద్ధమవుతోంది. అమెజాన్  ఏకంగా 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందన్న నివేదికలు వెలువడ్డాయి. దీంతో  వొడాఫోన్‌ ఐడియా షేరు 5శాతం లాభపడింది. ఈ  భారీ పెట్టుబడుల అంచనాలతో వొడాఫోన్‌​ ఐడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇన్వెస్టర్ల  కొనుగోళ‍్లతో కంపెనీ షేరు ఇంట్రా డేలో  రూ.9.36కి చేరింది. అలాగే గత రెండు రోజుల్లో ఈ షేరు 7.33 శాతం లాభపడింది.

ఇప్పటిదాకా అమెరికా టెక్‌ కంపెనీలనుంచి ఎలాంటి పెట్టుబడులు సాధించలేని ఏకైక టెల్కో వొడాఫోన్ ఐడియా. తాజా అంచనాలు అమలైతే కంపెనీకి భారీ పెట్టుబడి సమకూరినట్టే. గత రెండున్నరేళ్లుగా, అమెరికా టెక్‌ దిగ్గజాలు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌  ఇండియాలో తమ క్లౌడ్ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయ టాప్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్‌లో  భారీ పెట్టుబడి పెట్టాయి.

కాగా  రుణ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా మూల ధన సేకరణ నిమిత్తం ఇన్వెస్టర్ల వేటలో  ఉన్న సంగతి తెలిసిందే.  ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని నెట్‌వర్క్‌లో పెట్టుబడికి ఉపయోగించాలని కూడా యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.7,023 కోట్ల నష్టంతో పోలిస్తే ఈ క్యూ4లో రూ.6,563 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని టెల్కో నివేదించింది. అయితే  నవంబర్ 25, 2021 నుంచి అమలైన టారిఫ్ పెంపుతో ఏడాది క్రితం రూ. 9,608 కోట్ల నుండి క్యూ4లో కార్యకలాపాల  ఆదాయం  6.5 శాతం  ఎగిసి రూ. 10,240 కోట్లకు పెరిగింది. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ పది లక్షలకు కంటే ఎక్కువ కొత్త 4జీ సబ్‌స్క్రైబర్‌లను  సాధించింది.

మరిన్ని వార్తలు