Amazon own smart TV: అలెక్సాతో పనిచేసే టీవీ, ఫీచర్లు ఇలా ఉన్నాయ్‌!

5 Sep, 2021 15:12 IST|Sakshi

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సొంతంగా అమెజాన్‌ బ్రాండెడ్‌ టీవీని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. బ్రాండ్‌ ఫైర్‌ టీవీ (మల్టీపుల్‌ మోడల్‌) తరహాలో 55 నుంచి 75 అంగుళాల నిడివితో ఉన్న టీవీని అక్టోబర్‌లో అందుబాటులో తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. 

ఫీచర్స్‌
బిజినెస్‌ ఇన్‌ సైడర్‌ ప్రకారం.. వర్చువల్‌ అసిస్టెంట్‌ డివైజ్‌ 'అలెక్సా' కమాండ్‌ కంట్రోల్‌తో పనిచేసేలా రెండేళ్ల నుంచి టీవీపై వర్క్‌ చేస్తుంది. ఇందుకోసం చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీ టీసీఎల్‌ టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఇక అమెజాన్‌ - టీసీఎల్‌ భాగస్వామ్యంలో బిల్డ్‌ అవుతున్న ఈ టీవీలో  అడాప్టివ్ వాల్యూమ్‌ ఫీచర్‌ను  యాడ్‌ చేస్తుంది. డిష్‌వాషర్ ధ్వని, వ్యక్తుల మధ్య సంభాషణలు, ఎక్కడైనా ప్లే అవుతున్న మ్యూజిక్‌ గుర్తించి అలెక్సా స్పందించనుంది.వీటితో పాటు భారత్‌లో అమెజాన్‌ బేసిక్‌ బ్రాండెడ్ టీవీలను మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్ ఆధారితమైన తోషిబా, ఇన్‌సిగ్నియా టీవీలను విక్రయించనుంది. ఇందుకోసం కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీ బెస్ట్‌బైతో ఒప్పందం కుదుర్చుకుంది. 

సొంత సాఫ్ట్‌ వేర్‌ లేదు
అమెజాన్‌ సంస్థ ఇప్పటి వరకు 'వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్' అందించే సాఫ్ట్‌వేర్‌, ఇతర ఎక్విప్‌మెంట్‌లతో తయారు చేసిన టీవీలను అమెజాన్‌ మార్కెట్‌లో విడుదల చేస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా అమెజాన్‌ సంస్థ సొంతంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఆధారిత టీవీలను విడుదల చేయాలని భావిస్తుంది.ఇందులో భాగంగా తొలిసారి అమెజాన్‌ బ్రాండెడ్‌ టీవీ బిల్డ్‌ చేస్తుంది. వచ్చే నెలలో అమెరికా, ఆ తరువాత భారత్‌లో విడుదల చేయనుంది. 

మరిన్ని వార్తలు