Amazon Mobile Saving Days : ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫ‌ర్స్

10 Jun, 2021 16:35 IST|Sakshi

స్మార్ట్ ఫోన్ల‌పై భారీ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు 

40 శాతం వ‌ర‌కు ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన అమెజాన్ 

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ ద్వారా ఆఫర్లను ప్రకటించింది. జూన్ 12వ‌ర‌కు ఆయా ఫోన్ల‌పై ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మ‌నం ఆ వివ‌రాలేంటో తెలుసుకుందాం.  

రియల్‌మి, శాంసంగ్ , వివో, షియోమి స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు ఆఫర్లతో పాటు డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది అమెజాన్. ఉచిత ఈఎంఐ సౌక‌ర్యంతో పాటు డిస్కౌంట్ల‌ను, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,000 తగ్గింపు ఉంది. రియల్ మి ఎక్స్ 7ను కొనుగోలు చేసిన కష్ట‌మ‌ర్ల‌కు రూ.750 డిస్కౌంట్ తో పాటు అద‌నంగా రూ.1,000 అమెజాన్ కూపన్ అందిస్తుంది. రియల్ మీ నార్జో 30ఏ పై రూ. 8,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.   

గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఇ 5జి శాంసంగ్ ను అమెజాన్ కూపన్ ద్వారా రూ. 6,000 డిస్కౌంట్ తో సొంతం చేసుకోవ‌చ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులకు మరో 10 శాతం తగ్గింపుతో ఫోన్ ల‌భిస్తుంది. గెలాక్సీ ఎస్ 21 + 5జీని జీరో ప‌ర్సెంట్ ఇంట్ర‌స్ట్ పై ఆఫర్ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. రూ.12,999  శాంసంగ్  గెలాక్సీ ఎ 12 ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లావాదేవీలపై ₹ 750 డిస్కౌంట్ తో ల‌భిస్తోంది. దీంతో పాటు కొన్ని షియోమి ఫోన్ల‌పై ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది అమెజాన్‌. రూ. 10,990గల‌ రెడ్‌మి నోట్ 9 రూ.500 అమెజాన్ కూపన్‌తో పాటు రూ.750 డిస్కౌంట్ తో  కొనుగోలు చేయవచ్చు. రెడ్ మి 10 ఐ 5జి ఫోన్ పై రూ. 2,000 డిస్కౌంట్, రూ.13,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో సొంతం చేసుకోవ‌చ్చు. రెడ్‌మి 9 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుపై రూ.750 డిస్కౌంట్‌తో లభిస్తుంది. చ‌ద‌వండి : Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!

 ఒప్పో ఎఫ్ 17 పై రూ. 1,750 డిస్కౌంట్‌తో పాటు కూపన్‌పై అదనంగా రూ. 1,000 త‌గ్గింపుతో  కొనుగోలు చేయవచ్చు. రూ.25,990విలువైన  ఒప్పో ఎఫ్ 19 ప్రో + 5 జిపై  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ. 3,000 తగ్గింపుతో లభిస్తుంది. ఒప్పో ఏ74 5జీపై రూ.2వేల డిస్కౌంట్ ల‌భించ‌నుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు