Amazon Mobile Savings Days: అమెజాన్‌ మరో సేల్‌..! మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!

16 Aug, 2021 16:16 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన కస్టమర్ల కోసం అమెజాన్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్‌ తన కస్టమర్లకోసం మరో సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్‌ మొబైల్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఇతర మొబైల్‌ యాక్సెసరీలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది.


మొబైల్‌ కొనుగోళ్లపై పన్నెండు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐలను అమెజాన్‌ ఇవ్వనుంది. పలు మొబైల్‌ కొనుగోళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ డీల్స్‌ను కూడా అమెజాన్ తన కస్టమర్లకు అందించనుంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌  డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొనుగోలుదారులకు 10 శాతం సుమారు రూ. 1250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.  అంతేకాకుండా 'అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్' ప్లాన్‌ కింద ప్రైమ్‌ కస్టమర్లకు ఆరునెలల ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై మూడు నెలల అదనపు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ వంటి అదనపు ఆఫర్లను అమెజాన్‌ అందిస్తుంది. 


అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ భాగంగా వన్‌ప్లస్‌ ,షావోమీ , శాంసంగ్‌ , ఐక్యూ , రియల్‌మీ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై సుమారు 10 శాతం తగ్గింపు ధరను అమెజాన్‌ ప్రకటించింది. వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవ్వనుంది. ఈ మొబైల్‌ కొనుగోలుపై సుమారు రూ .4000 వరకు డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ కూపన్‌రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై పన్నెండు నెలల నో కాస్ట్‌ ఈఎమ్‌ఐతో పాటు అదనంగా రూ. 3000 డిస్కౌంటును పొందవచ్చును. ఎమ్‌ఐ 11 ఎక్స్ కొనుగోలు ఎక్సేచేంజీ పై అదనంగా  రూ. 5,000  తగ్గింపును అందిస్తుంది. మొబైల్ యాక్సెసరీస్‌ ప్రారంభ ధర రూ. 69 కాగా పవర్ బ్యాంకులు రూ.399 నుంచి ప్రారంభంకానున్నాయి. 

మరిన్ని వార్తలు