అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!

4 Dec, 2022 16:49 IST|Sakshi

మీరు తక్కువ బడ్జెట్‌లో ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటున్నారా.?  అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే.  కేవలం 7వేల రూపాయలకు ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌. 

టెక్నాలజీ పెరిగే కొద్దీ వస్తువులలో ఫీచర్లు పెరగడంతో పాటు వాటి ధరలు తగ్గుతున్నాయి. గతంలో ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీ 32 ఇంచెస్‌ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 25 వేలు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అదే స్మార్ట్‌ టీవీ రూ. 10వేలు లోపే దొరుకుతోంది.  తాజాగా అమెజాన్‌  రూ. 7వేలకు అదిరిపోయే స్మార్ట్‌ టీవీ తన కస్టమర్లకు అందిస్తోంది.
 

అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్‌
VW 80 cm (32 అంగుళాలు) HD Ready LED TV VW32A (బ్లాక్) (2021 మోడల్) టీవీపై బంపర్‌ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర చూస్తే బడ్జెట్‌లోనే దొరుకుతోంది. ఎలా అంటే కంపెనీ నిర్ణయించిన ఈ టీవీ అసలు ధర రూ.12,999 ఉండగా, అమెజాన్ వెబ్‌సైట్‌లో 48% డిస్కౌంట్‌ను లభ్యమవుతోంది. ఈ ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.

ఇందులో 60 hz రిఫ్రెష్ రేట్, 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉంది. దీనిపై ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. ఇతర ప్రాడెక్టలతో అనుసంధానం కోసం కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్‌లు ఉన్నాయి. 

చదవండి: ఎలాన్‌ మస్క్‌కు అమెజాన్‌ బంపరాఫర్‌!

మరిన్ని వార్తలు