యూజర్లకు షాక్‌, భారీగా పెరిగనున్న అమెజాన్‌ ప్రైమ్‌ ధరలు..ఎక్కడంటే

26 Jul, 2022 19:25 IST|Sakshi

యూజర్లకు ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారీ షాకివ్వనుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఫ్యూయల్‌ కాస్ట్‌ పెరగడం, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులతో పాటు వేర్‌ హౌస్‌ షార్టేజ్‌ వంటి కారణాల్ని చూపిస్తూ కొన్ని దేశాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ ధరల్ని 43శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెజాన్‌ ప్రైమ్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. 

పలు నివేదికల ప్రకారం.. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ధరల్ని పలు దేశాల్లో భారీగా పెరగనున్నాయి. పెరగనున్న దేశాల్లో భారత్‌ లేకపోవడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఏడాది కాలం పాటు పెరగనున్న సబ్‌ స్క్రిప్షన్‌ ధరలు ఒక్కసారి చూస్తే ఫ్రాన్స్‌లో 43శాతం, ఇటలీలో 49.90శాతం, స్పెయిన్‌లో 39శాతం, యూకేలో 95శాతం, జర్మనీ లో 89.90 శాతం వరకు ఉండనున్నాయి.  

భారత్‌లో ఎప్పుడు పెరిగాయంటే  
ఇతర దేశాల‍్లో అమెజాన్‌ దాని సబ్ స్క్రిప్షన్‌ ధరల్ని పెంచినా భారత్‌లో మాత్రం పెంచలేదు. చివరిసారిగా మనదేశంలో గతేడాది అక్టోబర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ దర రూ.129 నుంచి రూ.179కి పెంచింది. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ రూ.459, ఏడాదికి రూ.1499కి చేసింది. 
 
 

మరిన్ని వార్తలు