Amazon: మరోసారి షాకిచ్చిన అమెజాన్‌..! భారీగా పెరిగిన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధరలు..! ఈ సారి వారి వంతు..!

4 Feb, 2022 14:03 IST|Sakshi

ప్రముఖ ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధరలను పెంచుతూ  అమెజాన్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన ధరలు అమెరికాకు చెందిన యూజర్లకు మాత్రమే వర్తించనున్నాయి. 

భారీగా పెరిగిన ధరలు..!
అమెరికాలోని ప్రైమ్‌ యూజర్లకు షాకిస్తూ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను అమెజాన్‌ భారీగా పెంచింది. అమెజాన్ తన వార్షిక యూఎస్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ల ధరను 17 శాతం పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే ధరల పెంపు షిప్పింగ్ కోసం అధిక ఖర్చులు, ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతో కంపెనీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. దీంతో కొత్త అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌  నెలవారీ సేవలు 14.99 డాలర్లకు, వార్షిక ప్లాన్‌ సబ్‌ప్క్రిప్షన్‌ 139 డాలర్లకు పెరిగాయి.

కలిసోచ్చిన క్లౌడ్‌, యాడ్‌ వ్యాపారం..!
అమెజాన్‌కు క్లౌడ్‌, యాడ్‌ బిజినెస్‌ కాసులను కురిపిచింది. క్లౌడ్‌ బిజినెస్‌ అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ గణనీయమైన ఆదరణను పొందింది. ఊహించిన దాని కంటే మెరుగ్గా ఏడబ్ల్యూఎస్‌ సేవలు పనిచేశాయి. నిర్వహణ అంతరాయాలు, ఉత్పాదకత పడిపోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ 4 బిలియన్ల  ఖర్చులకు దోహదపడ్డాయని అమెజాన్‌ ప్రతినిధి ఒల్సావ్స్కీ చెప్పారు. ఈ త్రైమాసికంలో కార్మిక-సంబంధిత సవాళ్లు కొనసాగుతాయని, 2022లో మౌలిక సదుపాయాలపై కంపెనీ మూలధన వ్యయం పెరుగుతుందని ఆయన విశ్లేషకులకు తెలిపారు.

చదవండి: ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! ఆ సేవలపై ఏకంగా రూ. 1000కి పైగా..!

మరిన్ని వార్తలు