Amazon Prime: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు హెచ్చరిక..! 

23 Nov, 2021 15:59 IST|Sakshi

Amazon Prime Membership Price in India to Be Hiked From December: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు హెచ్చరిక..! ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ రేట్లను సుమారు 50 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా అమెజాన్‌ పెంచిన ధరలు వచ్చే నెల డిసెంబర్‌ 13 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలసరి, త్రైమాసిక, వార్షిక ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్స్‌ భారీగా పెరగనున్నాయి. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా ఉచిత డెలివరీలను, ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మ్యూజిక్‌ సర్వీస్‌లను అందిస్తోంది.    
చదవండి: అపర కుబేరుడి పెద్దమనసు.. భారీగా సొమ్ము దానం, వాళ్ల నోళ్లకు పుల్‌స్టాప్‌

ముందుగా చేస్తే తగ్గనున్న మోత..!
ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ సేవలు వచ్చే నెల నుంచి భారీగా పెరగడంతో యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ఛార్జీల మోత నుంచి తప్పించుకోవడం కోసం డిసెంబర్‌ 13 కంటే ముందుగానే ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ను తీసుకుంటే యూజర్లకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమెజాన్‌ ఇప్పటికే ‘లాస్ట్‌ ఛాన్స్‌ టూ జాయిన్‌ ప్రైమ్‌’ పేరుతో  ప్రచారాన్ని మొదలుపెట్టింది. 

కొత్త ధరలు ఇలా ఉన్నాయి..
డిసెంబర్‌ 13 నుంచి మారనున్న ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధరలు ఇలా ఉన్నాయి. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి పెరగనుంది. మూడు నెలల సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ.329 ఉండగా రూ.359కి పెరగనుంది. వార్షిక సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ. 999 ఉండగా అది కాస్త రూ.1,499కి పెరగనుంది. 
చదవండి: క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులకు నోటీసులు

మరిన్ని వార్తలు