మొబైల్‌ యూజర్లకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సూపర్‌ ఆఫర్‌

13 Jan, 2021 15:49 IST|Sakshi

ప్రపంచంలోనే తొలిసారిగా  మొబైల్-ఓన్లీ ప్లాన్‌

నెలకు రూ.89ల అమెజాన్‌ ప్రైమ్‌వీడియో  ప్రారంభ ప్లాన్‌

సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌ ప్రైమ్‌వీడియో తన వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది.  అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రపంచంలోనే తొలిసారిగా  మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది.  ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం 89 రూపాయల ప్లాన్‌నుంచి ప్రారంభయ్యేలా ప్లాన్లను తీసుకొచ్చింది.  ఓవ‌ర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్ మ‌ధ్య పోటీ తీవ్ర మవుతున్న నేపథ్యంలో  ఈ కొత్త స్ట్రాటజీతో  యూజర్లను ఆకర్షించనుంది. ముఖ్యంగా . ఓటీటీ ప్రత్యర్థి , టాప్ ప్లేస్‌లో ఉన్న‌ నెట్‌ఫ్లిక్స్‌కు ఎదుర్కొనేలా సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ ప్లాన్‌ను నెలకు రూ. 199 ధరతో విడుదల చేసిన తర్వాత వీటిని లాంచ్‌ చేయడం గమనార్హం.

ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతోఈ కొత్త ప్లాన్‌ను అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా  ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్ర‌య‌ల్ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 28 రోజుల‌కు రూ.89 వ‌సూలు చేస్తారు. ప్రైమ్ వీడియో సేవలు మొబైల్‌లోఅందుబాటులోఉంటాయి.  అలాగే ఇదే ప్లాన్‌లో 6 జీబీ డేటా కూడా వ‌స్తుంది ఎస్‌డీ (స్టాండ‌ర్డ్ డెఫినిష‌న్‌) క్వాలిటీ స్ట్రీమింగ్ అందిస్తుంది.అయితే  ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్లపై కేవ‌లం ఒక్క యూజ‌ర్ మాత్ర‌మే ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయ‌వ‌చ్చు.

రూ.89ప్లాన్‌: వాలిడిటీ 28రోజులు, 6 జీబీ డేటా
రూ.299 ప్లాన్ :  28రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో  ప్రైమ్ వీడియోతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌.. రోజుకు 1.5 జీబీ డేటా వ‌స్తుంది.

మొబైల్‌  డేటా సేవలకుఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్స్‌ తీసుకొచ్చామని అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా  ప్రత్యేకమైన, అసలైన కంటెంట్‌తో ప్రతి భారతీయుడిని అలరించనున్నామని తెలిపారు.  కాగా ప్రైమ్ వీడియో సాంప్ర‌దాయ ప్లాన్ నెల‌కు రూ.129, సంవ‌త్స‌రానికి రూ.999గా ఉన్న విష‌యం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా