పండుగ సీజన్ : అమెజాన్ కీలక అడుగు

8 Sep, 2020 15:48 IST|Sakshi

వేగంగా డెలివరీ లక్ష్యం

కొత్తగా 5 సార్టింగ్ సెంటర్లు

సాక్షి, ముంబై: రానున్న పండుగ సీజన్ కు అనుగుణంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా  సిద్ధమవుతోంది. అయిదు కొత్త కేంద్రాలతో తన సార్ట్ సెంటర్ నెట్‌వర్క్ విస్తరణను అమెజాన్ ప్రకటించింది. తద్వారా పండుగ సీజన్కంటే ముందే వినియోగదారులకు, అమ్మకందారులకు డెలివరీ వేగాన్ని, కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తున్నామని అమెజాన్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం, ఫరూఖ్ నగర్, బెంగళూరు, అహ్మదాబాద్ ముంబైలో వీటిని ప్రారంభించనుంది. అలాగే ప్రస్తుతమున్న ఎనిమిది సార్టింగ్ గిడ్డంగులను కూడా విస్తరిస్తున్నట్లు ఈకామర్స్ మేజర్ తెలిపింది, కొత్త కేంద్రాలతో పాటు, అమెజాన్ ఇండియా 19 రాష్ట్రాలలో మొత్తం సార్టింగ్ ప్రాంతాన్ని 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెంచుతుంది.

ఈ కేంద్రాలు అమెజాన్‌కు ప్యాకేజీలను సమీకరించడంలో సహాయపడతాయనీ అవి స్థానిక డెలివరీ స్టేషన్లనుంచి వినియోగదారులకు  చేరతాయని తెలింది. కస్టమర్లకు ప్యాకేజీ  స్థానం రవాణా విధానం ఆధారంగా విభజన చేసి సార్ట్ స్లైడ్స్, ఆటో సార్టర్స్  టెక్నాలజీ ఆటోమేషన్‌ద్వారా ఎండ్-టు-ఎండ్ సార్టింగ్ చేసి వేగంగా డెలివరీ చేయనున్నామని తెలిపింది. ఈ విస్తరణ వ్యక్తులు, సహాయక పరిశ్రమలకు ముఖ్యంగా దేశంలో ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఉన్న ఈ సమయంలో వందలాది అవకాశాలను సృష్టిస్తుందనీ, అమెజాన్ ఇండియా ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు. కాగా జూలై 2020లో, అమెజాన్ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ నెట్‌‌వర్క్‌‌ను విస్తరణ ప్రణాళికలను  ప్రకటించింది. కొత్తగా 10 సెంటర్లతోపాటు ఇప్పటికే ఉన్న 5 భవనాల ద్వారా  ఫుల్‌‌ఫిల్‌‌మెంట్  నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు